టీవీ సీరియల్ అనుకరిస్తూ నిప్పంటించుకున్న చిన్నారి....

SMTV Desk 2017-11-29 18:12:33  TV serial imitate issue, girl child died with serial imitate, karnataka news.

బెంగళూరు, నవంబర్ 29 : టీవీ సీరియల్ చూస్తూ ఓ చిన్నారి ఒంటికి నిప్పంటించుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. దేవన్‌గిరి జిల్లాలోని హరిహర పట్టణానికి చెందిన ఏడేళ్ల ప్రార్థన అనే బాలిక ప్రతిరోజూ తన తల్లితో కలిసి టీవీ సీరియళ్లు చూసేది. అయితే కన్నడ టీవీ సీరియల్‌లో ఓ పాత్ర మంటల్లో డ్యాన్స్‌ చేస్తున్న ఘటన చూసి ఆ చిన్నారి దాన్ని అనుకరించాలని ప్రయత్నించింది. అనుకున్నదే తడవుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చుట్టూ కాగితాలు చింపి వేసుకొని నిప్పంటించుకుంది. వాటి మధ్యలో డ్యాన్స్‌ చేస్తూ తీవ్రగాయాలపాలైంది. ఇది గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.