కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన వీహెచ్‌

SMTV Desk 2017-11-29 17:20:16  cm kcr, ktr, congrees leader v. hanumanthrao, comments

హైదరాబాద్, నవంబర్ ‌: జీఈఎస్ సదస్సులో మహిళా సాధికారతపై కేటీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు విమర్శించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేని విషయం ఇవాంకకు తెలియదని, తెలిస్తే ఆమె కేటీఆర్‌ను ప్రశ్రించేవారని అన్నారు. అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్‌కు కొడుకు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదని వీహెచ్‌ ఎద్దేవా చేశారు. నగరానికి భారత ప్రధాని వచ్చినప్పుడు ప్రథమ పౌరుడైన మేయర్‌ స్వాగతం పలకడం ఆనవాయితీ అని, అయితే ఈ సారి మేయర్‌ ఎక్కడా కనిపించలేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేరు గానీ, జీఈఎస్‌ సదస్సులో మహిళా సాధికారతపై కేటీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.