జీవన్‌ అక్షయ్‌ పాలసీకి ఎల్‌ఐసీ రాం...రాం...!

SMTV Desk 2017-11-29 15:46:29  lic, jeevan akshay plan, irda department, mumbai

ముంబై, నవంబర్ 29 : భారతీయ ప్రముఖ (ఎల్‌ఐసీ) అత్యంత ప్రజాదరణ పొందిన జీవన్‌ అక్షయ్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఎల్‌ఐసీ విక్రయిస్తున్నా అన్ని పాలసీల్లో, జీవన్‌ అక్షయ్‌ సంస్థకు అక్షయపాత్రలాంటింది. కానీ తగ్గిపోతున్న వడ్డీరేట్లు నేపథ్యంలో పాలసీని కొనసాగించడం అసాధ్యమని సంస్థకు చెందిన ఓ సీనియర్‌ ఆధికారి తెలిపారు . అయితే తక్కువ వడ్డీరేటుతో ఈ పాలసీని మరల ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు తెలియజేశామన్నారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే తిరిగి ప్రారంభిస్తామని ఎల్‌ఐసీ సంస్థ ఆధికారులు తెలిపారు. సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ కలిగిన ఈ పాలసీ ద్వారా ఈ ఏడాది రూ.10వేల కోట్ల ఆదాయం రాగా, గత రెండేళ్లలో రూ.22వేల కోట్లు ఎల్‌ఐసీకి వచ్చాయి.