కాళేశ్వరం అనుమతుల కోసం ఢిల్లీకి హరీశ్‌రావు

SMTV Desk 2017-11-29 14:19:09  Irrigation Minister Harisravu, delhi, kaleshwaram project

న్యూఢిల్లీ, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పలు ప్రాజెక్టుల అనుమతులకై మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ, పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా రావడానికి ఆయన నేడు కేంద్ర జలవనరుల సంఘం అధికారులను కలవనున్నట్లు తెలిసింది. దీంతోపాటు అపరిష్కృతంగా ఉన్న అంశాలనూ ఆయన చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్‌ సింగ్‌ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఒకసారి ఆయనతో భేటీ కావాలని హరీశ్‌రావు యోచిస్తున్నట్లు సమాచారం.