మంత్రి అఖిల ప్రియకు ఎమ్మెల్యే కౌంటర్..

SMTV Desk 2017-11-29 13:29:56  ap assembly meeting, bhuma akhila priya, mla gowtu shyam sunder shivaji.

అమరావతి, నవంబర్ 29 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి భూమా అఖిల ప్రియకు ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ శివాజీ కౌంటర్ వేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు తెలుగుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పలు ఇంగ్లీష్ పదాలు వాడారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూనే ఇంగ్లీష్ పదాలను వాడడమేంటి..? అని ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ అఖిల ప్రియపై వ్యంగ్యాస్రాలు సంధించారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదాలు వాడకుండా, పూర్తిగా తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని ఆయన పలు సూచనలు చేశారు.