21వ రోజు ప్రారంభమైన జగన్ పాదయాత్ర...

SMTV Desk 2017-11-29 13:16:40  praja sankalpa yatra, jagan, kurnool, ysrcp

కర్నూల్, నవంబర్ 29: ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 21వ రోజు ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో బుధవారం పాదయాత్ర కొనసాగుతోంది. ఐ.కొండ క్రాస్‌ రోడ్డు మీదుగా గంజిహళ్లి చేరుకున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర కొనసాగి, అనంతరం వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మద్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. 03.30గంటలకు బైలుప్పలకు చేరుకుంటారు. అనంతరం 4.30గంటలకు బి అగ్రహారం వద్ద పార్టీ జెండా ఎగరవేసి ప్రసంగి౦చి సాయంత్రం 6గంటలకు పాదయాత్ర విరమించి వైఎస్‌ జగన్‌ బసచేస్తారు.