ఆశ్చర్య వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ అధ్యక్షుడు

SMTV Desk 2017-11-29 12:18:50  Pakistans former president, commander Pervez Musharraf, terrorist

కరాచీ, నవంబర్ 29 : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, సైన్యాధిపతి పర్వేజ్‌ ముషారఫ్‌ చేసిన వ్యాఖ్యలకు స్థానికులు ఆశ్చర్యపోయారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’కు తాను అతిపెద్ద మద్దతుదారునని ఆయన అన్నారు. ఆరీ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తూ... నేనెప్పుడూ కశ్మీర్‌పై చర్యలకు మద్దతుగా ఉంటా. అతను కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకోవడంతో అభిమానిగా మారాను. నేను ఉదారవాదిని. ఆధునిక భావాలు గలవాడినంటు, కానీ దీనర్థం మతపెద్దలకు వ్యతిరేకమని కాదని, ముషరఫ్‌ అన్నారు. ఇన్నాళ్లు గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్‌ను పాకిస్థాన్‌ కోర్టు గతవారం విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో తన పేరు తొలగించాలని హఫీజ్‌ కోరుతున్న విషయం తెలిసిందే. అతి కిరాతకుడైన అతని తలపై అమెరికా కోటి డాలర్ల రివార్డు ప్రకటించింది. ‘నేను లష్కరేకు పెద్ద అభిమానిని. వారికీ నేనంటే ఇష్టమే. అంతేకాదు జమాత్‌ ఉద్‌ దవాకు నాపై అభిమానం ఉందని ముషరఫ్‌ తెలిపారు. మేం శాంతి వైపు పయనిస్తున్నాం. అందుకే ముజాహిదీలను తగ్గించాలని భావించా. రాజకీయ చర్చలు పెంచాలనుకున్నా. నిజం చెప్పాలంటే అప్పుడు సయీద్‌ గురించి అంతగా తెలీదు. కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకోవడంతో అతనిని అభిమానిస్తానని పేర్కొన్నారు.