లోక్‌స‌భ మొద‌టి మ‌హిళ‌ జనరల్ సెక్రటరీగా స్నేహ‌ల‌త శ్రీవాత్స‌వ‌

SMTV Desk 2017-11-29 12:03:44  First Secretary General of the Lok Sabha, Snehalatha Srivastava, anoop misra.

న్యూఢిల్లీ, నవంబర్ 29 : లోక్‌స‌భ మొద‌టి మ‌హిళ‌ జనరల్ సెక్రటరీగా స్నేహ‌ల‌త శ్రీవాత్స‌వ‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆమెను జనరల్ సెక్రటరీగా నియ‌మిస్తూ సెక్ర‌టేరియ‌ట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం జనరల్ సెక్రటరీ గా సేవలు అందిస్తున్న అనూప్ మిశ్రా నుంచి ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ 1982 ఐఏఎస్‌ బ్యాచ్ కు చెందిన స్నేహ‌ల‌త గ‌తంలో న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ల్లో ప‌నిచేశారు. కాగా ఆమె డిసెంబ‌ర్ 1న బాధ్య‌త‌లు స్వీకరించి న‌వంబ‌ర్ 30, 2018 వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.