రసాభాసగా కెన్యా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవ౦...

SMTV Desk 2017-11-29 11:29:41  kenya, president, kenyettaa, confrontation

నైరోబి, నవంబర్ 29: కెన్యా అధ్యక్షుడు కెన్యెట్టా ప్రమాణ స్వీకారోత్సవ౦ రసాభాసగా మారింది. అధ్యక్షుడిగా నెహురూ కెన్యెట్టా ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ప్రధాన, ప్రతిపక్ష పార్టీల మద్దతు దారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాన, ప్రతిపక్షాలకు చెందిన మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. నైరోబిలోని కసరాని స్టేడియంలో జరగనున్న కెన్యట్టా ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, దేశంలో నాలుగు నెలలుగా జరిగిన రాజకీయ తిరుగుబాటులో భాగంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు పోలీసుల చేతిలో మృతి చెందిన వారే. వారి స్మృత్యర్థం ఒక మెమోరియల్‌ ర్యాలీ నిర్వహించేందుకు ప్రతిపక్షం ప్రయత్నించింది. దీంతో పోలీసులు ప్రతిపక్ష మద్దతుదారులపై భాష్పవాయు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.