బిగ్‌టీవీకి రిలయన్స్ వీడ్కోలు

SMTV Desk 2017-11-29 11:20:53  

న్యూఢిల్లీ,నవంబర్ 29 : అనిల్‌ ధీరూబాయి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌సంస్థ, రుణ భారం తగ్గించుకొనే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డీటీహెచ్‌ (డైరెక్ట్ టు హోమ్) సేవల బ్రాండ్, బిగ్‌ టీవీని విక్రయించినట్టు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. పెంటెల్‌ టెక్నాలజీస్‌, వీకాన్‌ మీడియా అండ్‌ టెలివిజన్‌కు విక్రయించే నిమిత్తం ఒప్పందం కుదుర్చుకున్నామని ఆర్‌కామ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఎంత మొత్తానికి డీల్ కుదిరిందన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. తమ రుణ భారాన్ని తగ్గించేందుకు ఈ లావాదేవీ ఉపయుక్తకరమని, డీల్ తరువాత, ఆర్‌ కామ్‌ వాటాదార్లకు, రుణదాతలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. తాము బిగ్ టీవీని విక్రయించినా, తమ సేవలను వాడుకుంటున్న 12 లక్షల మంది కస్టమర్లకు వినోద సేవల విషయంలో ఎటువంటి అంతరాయం ఉండదని తెలిపింది.