ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని తగ్గించిన ఐసీఎస్‌ఈ...!

SMTV Desk 2017-11-29 11:11:02  icse, decrease, pass marks, students

న్యూ డిల్లీ, నవంబర్ 29: 10, 12వ తరగతి విద్యార్దులకు శుభవార్త. వచ్చే విద్యా సంవత్సరం (2018- 2019) నుంచి పది, పన్నెండో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేందుకు అవసరమైన కనీస మార్కుల శాతాన్ని తగ్గించనున్నట్లు కౌన్సిల్ అఫ్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ తెలిపింది. ఇతర బోర్డులతో సమానంగా ఉండేలా చూడటంలో భాగంగా... వీటిని వరుసగా 35 నుంచి 33 శాతానికి (10వ తరగతి), 40 నుంచి 35 శాతానికి (12వ తరగతి) తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్‌ అధికారులు వివరించారు. దీనితో విద్యార్ధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.