అతిథులకు ఫలక్‌నుమాలో దావత్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2017-11-29 11:06:46  falak numa palace, dinner, ivanka trump, modi, cm kcr, hyderabad

హైదరాబాద్, నవంబర్ 29 : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు దేశవిదేశాల నుంచి తరలి వచ్చిన వ్యాపార వేత్తలకు ఫలక్ నుమా ప్యాలెస్ లో కేంద్ర ప్రభుత్వం 200 రకాల వంటకాలతో విందు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారుగా కుమారై ఇవాంక ట్రంప్, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో ఈ విందులో పాల్గొన్నారు. 101 మంది కూర్చునే భారీ టేబల్ పై వీరు భాగస్వాములయ్యారు. ఈ విందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు పారిశ్రామిక విత్త శోభన కామినేని, ప్రతాప్ సీ రెడ్డి, బీబీ మోహన్ రెడ్డి, ఉపాసన, సంజయ్ బారు తదితరులు హజరయ్యారు.