కూతురి ప్రసంగానికి ముగ్ధుడైన ట్రంప్..

SMTV Desk 2017-11-29 10:46:04  America president Donald trump, twit for ivanka speech, ges meeting.

హైదరాబాద్, నవంబర్ 29 : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా పై డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తన కుమార్తె ప్రసంగానికి ముగ్ధుడైన ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. "గ్రేట్ వర్క్ ఇవాంకా" అంటూ ఓ కామెంట్ పెట్టారు. నిన్న జరిగిన జీఈఎస్ ప్రారంభ సభలో.. తమ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక విధానాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించిన ఇవాంకా మాటలను యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ఓ 20 సెకన్ల వీడియో రూపంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ప్రతి స్పందనగా ట్రంప్ పై విధంగా కామెంట్ పెట్టారు.