రామ్‌గోపాల్‌ వర్మపై ఆసక్తికర పోస్టు చేసిన ఛార్మి..

SMTV Desk 2017-11-28 18:24:26  heroine charmi comments on director ram gopal varma, sreedevi.

హైదరాబాద్‌, నవంబర్ 28 : దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన అభిమాన నటి శ్రీదేవి అని చాలా సందర్భాల్లో తెలియజేశారు. అంతేకాదు శ్రీదేవిని దేవతతో పోలుస్తూ వర్మ అనేక పోస్టులు కూడా పెట్టాడు. అయితే తాజాగా ప్రముఖ నటి ఛార్మి ఒక ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో శ్రీదేవి పాటను వర్మ ఏ మాత్రం చూపు తిప్పకుండా లీనమైపోయి ఆ పాటను చూస్తున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఛార్మి క్యాప్షన్‌గా.. "భక్తుడు రామ్‌గోపాల్‌ వర్మ.. శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం" అని పోస్ట్‌ చేశారు.