జీఈఎస్ ప్రారంభం

SMTV Desk 2017-11-28 17:43:14  GES Meeting, start, hyderabad, ivanka, modi, cm kcr

హైదరాబాద్, నవంబర్ 28 ‌: కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా భారత ప్రదాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ హాజరు కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. దీనికి మునుపు సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, ఇవాంక, గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ తిలకించారు. కాగా, ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్‌, సుష్మాస్వరాజ్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ నారా బ్రాహ్మణి, ఆపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన, సినీనటి మంచు లక్ష్మి, జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.