ఇవాంకా విందులో వంటకాలు..

SMTV Desk 2017-11-28 17:24:40  Ivanka Trump, Taj Falaknuma palace, modi dinner party.

హైదరాబాద్, నవంబర్ 28 : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంకాకు ప్రధాని మోదీ ఫలక్ నుమా ప్యాలస్ లో విందును ఏర్పాటు చేశారు. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ విందు 101 డైనింగ్ హాల్ లో జరగనుంది. ఈ డైనింగ్ ను నిజాం రాజు నిర్మించడం విశేషం. ఈ కార్యక్రమానికి ఇవాంకా ట్రంప్ తో పాటు, కేసీఆర్, అమెరికా ప్రతినిధులు, పలువురు రాజకీయ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని ఇస్తున్న ఈ విందు వంటకాలు మరీ ముఖ్యంగా గంధం, కుంకుమ వేళవించిన వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఘోస్ట్ షికాంపురీ కీబాబ్, దహీ కే కీబాబ్, మెజ్ బన్, గులాబ్ జామ్ వంటలతో పాటు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరిన్ని వంటకాలు ఉంటాయి.