అతిపెద్ద స్కెచ్ చిత్రం మోదీదే

SMTV Desk 2017-11-28 16:28:03  modi Sketch picture, manoj soni, gujarath, twitter

న్యూఢిల్లీ, నవంబర్ 28 : దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రదాని నరేంద్ర మోదీ అతిపెద్ద చిత్రాన్ని స్కెచ్ తో గుజరాత్ కు చెందిన యువకుడు గీశాడు. గుజరాత్‌కు చెందిన మనోజ్‌ సోని ఐదు నెలల పాటు కష్టపడి మోదీ చిత్రాన్ని గీసి ఆ ఫొటోను యువకుడు ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చాడు. మొత్తం రంగుల పెన్సిల్స్‌ ఉపయోగించి దీన్నిఅద్భుతంగా వేశాడు. ఈ 80 చదరపు అడుగుల స్కెచ్‌ను మనోజ్‌ ప్రధానికి బహుమతిగా ఇవ్వగా, అది అందుకున్న మోదీ, మనోజ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ వైపు జీఈఎస్‌ సదస్సు, హైదరాబాద్‌ మెట్రో ప్రారంభం కార్యక్రమం, మరో వైపు గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీ బిజీగా ఉన్నప్పటికీ, మనోజ్‌ కోసం ప్రత్యేకంగా కొద్ది సమయాన్ని కేటాయించి మరి కృతజ్ఞతలు తెలిపారు.