తనపై వస్తున్న ఆరోపణలకు షాక్ కు గురైన హర్థిక్ పటేల్

SMTV Desk 2017-11-28 15:58:21  Patthar movement leader Hartik Patel, Pornography video, viral

గుజరాత్, నవంబర్ 28 : పటిదార్ ఉద్యమ నేత హర్తిక్ పటేల్ తనపై వస్తున్న ఆరోపణలతో షాక్ కు గురయ్యారు. ఇటీవల అశ్లీల వీడియోల పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తుండటంతో, తన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆ సీడీలో ఉన్నది తానా? కాదా అనే విషయం ఎవరికీ అవసరం లేదన్నారు. సీడీలోఉన్నదంతా కల్పితమని, పచ్చి అబద్దమని తెలిపారు. తనకు రూ. 2 కోట్లు ఇస్తే అదే వీడియోలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముఖాన్ని కూడా పెట్టగలనని చెప్పారు. బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.