హెచ్ సిసిఐ కి విచ్చేసిన ఇవాంక, మోదీ

SMTV Desk 2017-11-28 15:30:09  ivanka trump, narendra modi, kcr, metro station launch, hyd meeting.

హైదరాబాద్, నవంబర్ 28 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మాదాపూర్‌లోని జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)పాల్గొనేందుకు హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం మియాపూర్‌ నుంచి ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకోగా, ఇవాంక ట్రంప్‌ కూడా ట్రైడెంట్‌ హోటల్‌ నుంచి రోడ్డు మార్గంలో భారీ బందోబస్తు మధ్య నేరుగా అక్కడికి విచ్చేశారు. ఇవాంకా 4:30 నిమిషాలకు సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును (జీఈఎస్‌) ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.