కొన్ని క్షణాల్లో హైదరాబాద్ కు మోదీ రాక

SMTV Desk 2017-11-28 13:15:24  hyderabad, modi, cm kcr , modi visit hyderabad.

హైదరాబాద్, నవంబర్ 28 : నేడు హైదరాబాద్ లో జరిగే జీఈఎస్ సదస్సుతో, పాటు మెట్రో రైలును ప్రారంభించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రత్యేక వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరో కొద్దీ క్షణాల్లో ఆ విమానం బేగంపేట ఎయిర్ పోర్టుకు రానుండడంతో, మోదీకి స్వాగతం పలికేందుకు మధ్యాహ్నం 1.30 గంటల తరువాత కేసీఆర్ తో పాటు ప్రొటోకాల్ అధికారులు బేగంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మియాపూర్ కు మోదీ బయలుదేరుతారు.