తమిళనాడు లో మరోసారి ఐటీ కలకలం

SMTV Desk 2017-11-28 13:01:27  it department, rides on jaya tv, sasikala, tamilanadu

చెన్నై, నవంబర్ 28 : పన్ను ఎగవేత వ్యవహారంలో చెన్నైలో మంగళవారం మరో 33 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడులు తమిళనాడు బడాబాబుల సంస్థల్లో కలకలం రేపుతున్నాయి. చెన్నైలోని 21 ప్రాంతాలు, చెన్నై వెలుపల మరో 12 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. స్పెక్ట్రమ్‌ మాల్‌, పటేల్‌ గ్రూప్‌, మార్గ్‌ గ్రూప్‌, మిలాన్‌ గ్రూప్‌, గంగా ఫౌండేషన్‌ గ్రూప్‌కు చెందిన ఆఫీసులు, నివాస స్థలాల్లో ఈ సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బంధువుల ఇళ్లు, జయ టీవీ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం విధితమే. ఈ సోదాల్లో రూ.1,430 కోట్ల లెక్కకు రాని ఆస్తిని ఆధికారులు గుర్తించారు.