జాగ్రత్త వహించండి.. హెచ్చరించిన ఎల్ఐసీ

SMTV Desk 2017-11-28 11:42:04  life insurance corporation of india, fake sms, adhar link issue.

న్యూఢిల్లీ, నవంబర్ 28 : బీమా పథకాలతో ఆధార్‌ను అనుసంధానించమని వచ్చే ఎస్సెమ్మెస్‌లపై కాస్త జాగ్రత్త వహించమని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చరికలు జారీ చేస్తోంది. తాము ఇప్పటివరకు బీమా పథకాలకు అలాంటి ప్రక్రియను చేపట్టలేదని వెల్లడించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరుతూ వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులను నమ్మించేందుకు ఎల్ఐసీ లోగోను సైతం పంపిస్తున్నారని, కావున ఈ ఎస్సెమ్మెస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ అధికారులు కోరుతున్నారు. అలాంటి ప్రక్రియ ఒకవేళ చేపడితే పూర్తి వివరాలను ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు.