ఇవాంకాపై దాడికి ఐఎస్ఐఎస్ కుట్ర..!

SMTV Desk 2017-11-28 11:20:36  Ivanka Trump, Hyderabad tour, isis terrarist spot, Israel defense equipment

హైదరాబాద్, నవంబర్ 28 : హైదరాబాద్ లో పర్యటన నిమిత్తం వచ్చిన ఇవాంకా ట్రంప్ పై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర పన్నుతోందని సమాచారం అందడంతో ఆమెకు రక్షణగా ఇజ్రాయిల్ రక్షణ పరికరాలను రంగంలోకి దింపారు. ఇవాంకా భద్రత విషయంలో ఇప్పటికే 10,400 మంది పోలీసులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించగా, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు నిరంతరం ఆమె చుట్టూ గస్తీ కాస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఆమె భద్రత పరంగా హెచ్ఐసీసీ, ఫలక్ నుమా, ట్రైడెంట్ హోటల్ వరకు విధ్వంసక వ్యతిరేక, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఇవాంకా ప్రయాణాలు సాగుతున్నాయి.