అత్యాచార బాధిత విద్యార్థిని సస్పెండ్ చేసిన పాఠశాల...

SMTV Desk 2017-11-28 11:11:40  Suspended rape student, maharashtra

లాతూరు, నవంబర్ 28 : ప్రేమ పేరుతో ఆర్మీ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు.. దీంతో జీవితం శూన్యంమైన బాలికకు అత్మస్తైర్యాన్ని నింపాల్సిన పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసి తనను మరింత మనోవేదనకు గురిచేశారు. బాధితురాలి మేనమామ తెలిపిన కథనం ప్రకారం.. లాతూరు జిల్లాలోని పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని ఓ ఆర్మీ జవాను ప్రేమించానంటు, పెళ్లి చేసుకుందామని పలుమార్లు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఉన్నట్టుండి, ముఖం చాటేయడంతో, తన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలిక అత్యాచారానికి గురికావడం, పోలీస్ స్టేషన్‌కు ఎక్కడంతో, ఇవి అన్ని గమనించిన స్కూలు యాజమాన్యం, తమ పాఠశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించి ఆ బాలికను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. దీంతో పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బాలిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదుకు రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. అన్యాయాన్ని తట్టుకోలేక బాధిత బాలిక నేరుగా జిల్లా ఎస్పీ శివాజీ రాథోడ్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో, దిగొచ్చిన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.