గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో అనుకోని అతిథి..

SMTV Desk 2017-11-28 11:03:46  donald trump speech in GES 2017, video conference,

హైదరాబాద్, నవంబర్ 28 : హైదరాబాద్ వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సదస్సులో అనుకోని అతిధి ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం కొన్ని నిమిషాలు మాత్రమే సాగుతుందని, ఔత్సాహికులను ప్రోత్సహించేదిగా ఈ ప్రసంగం ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తన కుమార్తెతో పాటు అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మాట్లాడనుండటం ఈ సదస్సుకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.