జయలలిత కుతురిన౦టూ పిటీషన్.. కేసు కొట్టివేసిన సుప్రీం కోర్టు...

SMTV Desk 2017-11-27 17:25:16  late Tamil Nadu cm Jayalalithaa, daughter suprim court Petition, amrutha.

చెన్నై, నవంబర్ 27 : దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కుతురినంటూ 37 ఏళ్ల అమృత వేసిన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల బెంగ‌ళూరుకు చెందిన 37 ఏళ్ల అమృత అలియాస్ మంజుల తానూ జయలలిత కుతురినంటూ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ విషయం నిరూపించడానికి డీఎన్ఏ ప‌రీక్ష చేయించుకోవడానికి అనుమ‌తినివ్వాలంటూ ఆమె కోర్టును కోరారు. కాని ఈ విషయాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమ‌ని వ్యాఖ్యానిస్తూ, ఈ కేసు విషయంలో క‌ర్ణాట‌క హైకోర్టును సంప్ర‌దించాల‌ని సూచించింది.