అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆదాయ‌ పన్ను శాఖ నోటీసులు..

SMTV Desk 2017-11-27 17:12:55  delhi cm aravaind kejrival, Income Tax Department issued notices, Foreign Contribution Regulation Act.

న్యూఢిల్లీ, నవంబర్ 27 : ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆదాయ‌ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను ఆమ్ ఆద్మీ పార్టీ తెలియజేయాలని అప్ప‌ట్లో ఆదేశాలు జారీ చేశారు. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఉల్లంఘించిందని తెలిపింది. ఈ మేరకు రూ.30.67 కోట్ల ఆదాయ‌ పన్ను నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై వ‌చ్చేనెల 7 లోపు సమాధానమివ్వాలని, అలాగే రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆమ్ ఆద్మీ వెల్లడించలేదని కూడా తెలిపింది. ఆ డ‌బ్బులు ఎలా వ‌చ్చాయనే అంశంపై 462 దాతలకు చెందిన వివరాలను రికార్డు చేయలేదని పేర్కొంది.