ప్రచార పర్వానికి మోదీ..

SMTV Desk 2017-11-27 12:46:22  prime minister modi, gujarath elections, ashapura matha temple, modi in kutch

కచ్, నవంబర్ 27 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్ రాష్ట్రంలో పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఈ ఉదయం కచ్‌ చేరుకున్న మోదీ ఆశాపుర మాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మోదీ కచ్‌, భుజ్‌, జాస్దన్‌, ధారీ, కమ్రేజ్‌ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని పలు ప్రసంగాలు చేయనున్నారు. ఇదిలా ఉండగా మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్‌ రానున్న మోదీ.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.