చంద్రబాబుపై సినీనటి జయప్రద ప్రశంసలు..

SMTV Desk 2017-11-27 11:44:56  heroine jayapradha, comments on chandrababu, politival entry issue.

హైదరాబాద్, నవంబర్ 27 : ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్ళడానికి శ్రమిస్తున్నారన్నారు. కొత్త రాజధానిని నిర్మించడం సామాన్యమైన విషయం కాదని, అన్ని అవసరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని, అందువల్ల కేంద్రం అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్యం, ఉపాధి, విద్య ఉద్యోగ కల్పన ఇలాంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో తానూ ఏ పార్టీలో లేనని.. త్వరలోనే రాజకీయ ప్రవేశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.