విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ..

SMTV Desk 2017-11-27 11:15:53  miss world 2017, Demi-Leh Nell Peters, South Africa

లాస్‌వేగాస్‌, నవంబర్ 27 : విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ డెమి-లేహ్‌ నెల్‌ పీటర్స్‌ ఎంపికయ్యారు. 1978లో చివరిసారిగా విశ్వసుందరి గౌరవాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. మొత్తం 92 మంది అమ్మాయిలు పాల్గొన్న ఈ పోటీల్లో డెమి-లేహ్‌ నెల్‌ పీటర్స్‌(దక్షిణాఫ్రికా) మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తొలి రన్నరప్‌గా లారా గొంజాలెజ్‌(కొలంబియా), రెండో రన్నరప్‌గా డెవీనా బెన్నెత్‌ (జమైకా) నిలిచారు. ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న భారత్.. ఈ విశ్వసుందరి పోటీల్లో శ్రద్ధ శశిధర్‌(భారత్) టాప్ 10 లో ఉన్నారు. కాగా విశ్వ సుందరిగా ఎంపికైన 22ఏళ్ల డెమి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు.