ఇవాంక కోసం ప్రత్యేకం..

SMTV Desk 2017-11-27 10:25:06  Ivanka Trump, Hyderabad tour, samantha gift for ivanka.

హైదరాబాద్, నవంబర్ 27 : అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి భాగ్యనగరానికి విచ్చేయుచున్న ఇవాంక ట్రంప్ కోసం నగరం అందంగా ముస్తాబైంది. ఇదిలా ఉండగా ఆమెకు కానుకగా ఇవ్వడానికి ప్రత్యేకమైన బహుమతులను సిద్దం చేశారు. అంతేకాకుండా సిద్ధిపేట కానుక కూడా రెడీ అయింది. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు కానుకగా ఇవ్వనున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటి, టీఎస్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత కూడా ఇవాంక కోసం కొన్ని ప్రత్యేకమైన డిజైన్లను సెలెక్ట్ చేసింది. ఇందులో నుంచే ఒక చీరను ఎంపిక చేసి, ఇవాంకకు అందించనున్నారు.