మరో వికెట్ కోల్పోయిన వైకాపా...

SMTV Desk 2017-11-26 18:28:26  mla Giddy Ishwari, ycp, tdp, visakhapatnam,

విశాఖపట్టణం, నవంబర్ 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా తెదేపాలొకి క్యూ కడుతున్నారు. అదే బాటలో విశాఖ‌ప‌ట్టణ౦ జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రేపు తెలుగు దేశం పార్టీలో చేర‌నున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రేపు పాడేరు నుంచి విజ‌య‌వాడ‌కు బయలుదేరుతున్నట్లు తెలిపారు. వైకాపా అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి వైఖ‌రితో తీవ్ర మ‌నస్తాపానికి గుర‌య్యాన‌ని వాపోయారు. పూర్తి వివ‌రాలు రేపు విజ‌య‌వాడ‌లో వెల్లడిస్తాన‌ని అన్నారు.