త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

SMTV Desk 2017-06-13 18:12:25   SI and Constable posts replacement, State Home Minister Nayani Narasimha Reddy ,Police station

రంగారెడ్డి, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ సోమవారం రోజున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 వేల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. వీటిలో 33 శాతం మహిళలకు కేటాయిస్తామని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలపై దృష్టి సారించాలన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధునాతన పొలీస్ స్టేషన్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, కృష్ణరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీ మల్లారెడ్డి, చైర్మన్ దామోదర్, జాయింట్ సీపీ తరుణ్ జోషీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కొరకై వేచ్చిచుస్తూన్న వారికి ఈ విషయం తీపి కబురుగా చెప్పవచ్చును.