మోదీ బాహుబలిలా విజయం సాధిస్తారు: మురళీధరరావు

SMTV Desk 2017-11-26 16:53:21  modi, muralidharrao, bjp, karnataka

బెంగళూరు, నవంబర్ 26: బీజేపీకి కేంద్ర బిందువు ప్రధాని నరేంద్ర మోదీయే అని, బాహుబలి సినిమా మాదిరి ఆయన మరింత విజయం సాధిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు అన్నారు. కర్నాటకలో ఆయన పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని మోదీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడం పద్దతి కాదని, అది ఆయన స్థాయికి తగదని మురళీధర్ రావు పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రపంచంలోనే మోదీ గురించి ఎన్నో సర్వేలు మంచి పాలన అందిస్తున్నట్లు చెబుతున్న విషయాన్ని మర్చిపోరాదని, అదే రీతిలో మోదీ ప్రధానిగా మరింత విజయాన్ని సాధిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశంలో బీజేపీ బాగా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు.