కాంగ్రెస్‌ నేతను పరామర్శించిన కేసీఆర్‌

SMTV Desk 2017-11-25 16:15:01  CM KCR, Congress leader Rajendra Prasad, Visitation

హైదరాబాద్, నవంబర్ 25 ‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తన మిత్రుడైన కాంగ్రెస్ పార్టీ నేత రాజేంద్రప్రసాద్‌ ను పరామర్శించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో, కేసీఆర్ హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి, ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.