పెళ్లిరోజు ఖర్చే 50 కోట్లటా !!!

SMTV Desk 2017-06-13 16:35:34  Foloranshko Alicja, the most wealthy black woman, Son of Folarine Alkija, Marriage, 50 crore per day wedding day

ఇంగ్లండ్, జూన్ 13 : అప్పట్లో పెళ్లి అన్న ప్రస్తావం వస్తే ఎవరైనా సరే అట్టహాసంగా, ఆర్భాటంగా, ఆకాశమంతా పందిరివేసి, భూగోళమంతా పీటలు వేసి అంగరంగ వైభవంగా వివాహం చేశారని చెప్పేవారు. కాని ఈ కాలంలో పెళ్ళికి ఎంత ఖర్చు పెడితే అంత ఆ పెళ్లి ఆర్భాటానికి కొలమానంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నల్లజాతి మహిళగా గుర్తింపు పొందిన ఫోలోరన్‌షో అలకిజా (66) తన కుమారుడు ఫోలారిన్‌ అలకిజా వివాహాన్ని ఆదివారం అత్యంత ఆర్భాటంగా చేశారు. ఒక్క పెళ్లి రోజే 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బ్లెన్‌హైమ్‌ ప్యాలెస్‌లో ఇరాన్‌కు చెందిన మోడలింగ్‌ బ్యూటీ నజానిన్‌ జఫారియాన్‌తో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. మాన్‌చెస్టర్‌ యూనివర్శిటీలో బయో ఇంజనీరింగ్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన జఫారియాన్‌ మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్‌గా, మోడల్‌గా ఇప్పుడు రానిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్, వ్యాపారవేత్తగా బాగా సంపాదిస్తున్న పెళ్లి కూమారుడు ఫోలారిన్‌కు 30 ఏళ్లు. ఆయనకు ఇది రెండో వివాహమట, మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆయన ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు.కేవలం వీరి పెళ్లి జరిగిన ప్యాలెస్‌కు రూములు కలుపుకొని రోజుకు మూడు కోట్ల రూపాయల అద్దె అట, వీరి పెళ్లి మండపం అలంకరన కొరకు కోటి తెల్ల గులాబీ పూలను ఉపయోగించారు. పెళ్లి కేకును అలంకరించేందుకే పది లక్షల తెల్ల గులాబీ పూలను ఉపయోగించి అలంకరణతో కలిపి ఒక్క కేకుకే కోటిన్నర రూపాయలు చెల్లించారట. ఇరువర్గాల బంధు, మిత్రులు హాజరైన ఈ వివాహంలో రాబిన్‌ థికే లాంటి గాయకులు తమ కచేరీలతో వివాహానికి హాజరైన అతిధులను కనువిందు చేసారు. . ఈ కళ బృందం రాబిన్‌ థికే ఒక కచేరీకి ఛార్జీ కోటిన్నర రూపాయలు. రెండు బిలియన్‌ డాలర్ల ఆస్తితో ఆఫ్రికాలో 14వ ధనవంతురాలిగా, బ్రిటన్‌లో నెంబర్‌ వన్‌ ధనవంతురాలిగా గుర్తింపుపొందిన ఫోలోరన్‌షో అలకిజా తన కుమారుడి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.