నోకియా 8 వినియోగదారులకు శుభవార్త

SMTV Desk 2017-11-25 15:49:30  nokia 8, android 8, oriyo up date version, hmd

న్యూఢిల్లీ, నవంబర్ 25 : ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా యూజర్లకు ఒక శుభవార్త. వారి కోసం ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నోకియా 8 ఫోన్లకు ఓరియో అప్‌డేట్‌ను ఇస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ జుహో సర్వికాస్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే నోకియా 2, నోకియా 3, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియోతో పాటు ఆండ్రాయిడ్‌ పి అప్‌డేషన్‌ కూడా ఇవ్వనున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ప్రకటించింది. ఇక నోకియా 8ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. దీని ప్రత్యేకతలు 4జీబీ ర్యామ్‌,64జీబీ అంతర్గత మెమొరీ , 13 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా , 13 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా , 3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 256 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం, 5.3 అంగుళాల తాకే తెర కలిగి ఉంది.