విడాకుల కోసం పంజాబ్ లో భర్త దాష్టీకం...

SMTV Desk 2017-11-25 14:49:23  punjab, husband, rape, divorse

చండీఘర్, నవంబర్ 25: స్త్రీల హక్కులు, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న తరుణంలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. భార్య తనలో సగం అని భావించాల్సిన భర్త తన నుంచి బలవంతంగా విడాకులు పొందేందుకు స్నేహితులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని లూధియానాలో బాధితురాలు మూడేళ్లక్రితం కూలి పని చేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ అది రెండో వివాహమే. పిల్లలు కనడం ఇష్టం లేని ఆ వ్యక్తి బాధితురాలికి 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఏకంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించాడు. అనంతరం విడాకులివ్వాలని ఆమెను వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు భర్త... గత జూన్ 6న తన ముగ్గురు స్నేహితులను ఆమె గదిలోకి పంపి తాళం వేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.