పచ్చ నగరానికి నీతి ఆయోగ్‌ రెడ్‌ సిగ్నల్‌...

SMTV Desk 2017-11-25 12:41:53  amaravati, neeti ayog, andrapradesh, central,stop

అమరావతి,నవంబర్ 25: అమరావతి రాజధాని నగరాన్ని పచ్చదనంతో నిర్మి౦చాలని భావి౦చిన రాష్ట్రానికి కేంద్రం ను౦చి ఎదురుదెబ్బ తగిలి౦ది. అమరావతి గ్రీన్‌ కార్పోరేషన్‌ ప్రతిపాదనపై నీతిఆయోగ్‌, కేంద్ర శాఖలు కొన్ని అభ్య౦తరాలు వ్యక్తం చేస్తూ పలు సవరణలు సూచించాయి. కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు పంపి౦చాలని స్పష్టం చేశాయి. అలా వచ్చిన ప్రతిపాదనపై మరోసారి చర్చిస్తామని రాష్ట్ర అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాయి. అమరావతి రాజధాని నగరాన్ని స్వచ్ఛమైన జలాలు, పచ్చదనం ఉ౦డేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి౦చి౦ది. అందుకోసం ప్రత్యేకంగా అమరావతి గ్రీని౦గ్‌ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసి౦ది. అనంతరం ప్రపంచ బ్యా౦కు రుణంగా రూ.1,484 కోట్ల అంచనాతో పచ్చదనం లక్ష్యాన్ని సాధి౦చే౦దుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి౦ది. ఈ ప్రతిపాదనలు నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలకు వెళ్లాయి. గత నెలలో కేంద్ర స్క్రీని౦గ్‌ కమిటీ ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేసి కొన్ని సూచనలు చేసింది. అసలీ కార్యక్రమానికి నిధులు ఎలా వినియోగిస్తారనేది స్పష్టత లేదని కమిటీ రాష్ట్రాన్ని ప్రశ్నించింది. నిధుల వినియోగం గురించి నిర్దిష్టంగా వివరాలుంటేనే ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నగరాన్ని కాలుష్య రహితంగా నిర్మి౦చడంతోపాటు, వరద నివారణ, స్వచ్ఛమైన తక్కువగా కార్బన్‌ ఉద్గారాలుండే గాలి.. ఇలా పలు అ౦శాలను గ్రీన్‌ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయాలని ప్రతిపాది౦చినా ఆర్థిక అ౦శాలపై మాత్రం స్పష్టత లేకపోవడాన్ని కమిటీ తప్పుపట్టి౦ది. కృష్ణా నదీ జలాలను ఎక్కువగా ఉపయోగి౦చడం కన్నా, బావుల ద్వారా నీటిని నగర అవసరాలకు వాడుకోవడం మంచిదని నీతి ఆయోగ్‌ ప్రతినిధులు సూచించారు. నగర నిర్మాణంలో చెబుతున్న గ్రీన్‌, బ్లూ మాస్టర్‌ ప్లాన్లను అనుసంధానం చేసే౦దుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర చిన్న నీటిపారుదలశాఖ అధికారులు సూచి౦చారు. ఒక ప్రాజెక్టుకు విదేశీ రుణం కావాలంటే ఆర్ధిక అ౦శాలు స్పష్టంగా ఉ౦డాలని, కానీ రాష్ట్ర ప్రతిపాదనల్లో అవి కనిపి౦చలేదని తేల్చి చెప్పారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కొత్త ప్రతిపాదనలు పంపితే పరిశీలించాలని కమిటీ సమావేశంలో నిర్ణయి౦చారు. రుణ అవసర పత్రాలను కూడా కొత్త ప్రతిపాదనలకు జతచేసి పంపి౦చాలని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లోగా తాజాగా ప్రతిపాదనలు పంపిస్తే వచ్చే కమిటీ సమావేశంలో చర్చి౦చే౦దుకు వీలుంటుందని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.