రాష్ట్రపతితో సమావేశమైన అమెరికా రాయబారి

SMTV Desk 2017-11-25 12:25:48  American ambassador Kenneth i Jester, President Ramnath Kovind, delhi

న్యూఢిల్లీ, నవంబరు 25 : అమెరికా రాయబారి కెన్నిత్‌ ఐ జెస్టర్‌, భారత్ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కార్యాలయానికి విచ్చేసిన ఆయన రాయబారిగా తన నియమాక పత్రాలను కోవింద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జెస్టర్ మాట్లాడుతూ...అమెరికా-భారత్‌ల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.