ట్రంప్ పొరబాటు పడుతున్నారు :టైమ్‌ మ్యాగజైన్‌

SMTV Desk 2017-11-25 11:18:14  Person of the Year, twitter, trump

వాషింగ్టన్, నవంబర్ 25 ‌: గతేడాది లాగే ఈ ఏడాది కూడా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కు మరో సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌లో టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరును ప్రకటించనుండడంతో, ఆ గౌరవం తనకు వద్దని ట్విటర్‌ ద్వారా ట్రంప్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందుకు ఎవరిని ఎన్నుకుందో ఆ మ్యాగజైన్‌ ఇంకా సమాచారం అందలేదు. కానీ ట్రంప్ ఇంటర్వ్యూ, ఫొటో షూట్‌ కావాలని ట్రంప్‌ను కోరింది. దీంతో మరోసారి తననే ఎన్నుకుంటున్నారని భావించి, ఆ అవార్డు తనకు వద్దని పేర్కొన్నారు. ‘గతేడాది లాగే ఈ సారి కూడా టైమ్‌ మ్యాగజైన్‌ నన్నే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే నన్ను ఇంటర్వ్యూ, ఫొటోషూట్‌ అడిగారు. అయితే ఇందుకు నేను వద్దని చెప్పాను. ఎనీవే.. థాంక్యూ..!’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే ట్రంప్‌ ట్వీట్‌కు టైమ్‌ కూడా స్పందించింది. అధ్యక్షుడు పొరబాటు పడుతున్నారని చెప్పింది.