‘ఆధార్‌’తో ఆచూకీ

SMTV Desk 2017-11-24 17:28:21  Adhaar, CEO Ajay Bhushan Pandey, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 24 : గత కొద్ది నెలల్లోనే ఆధార్‌ వల్ల 500 మందికి పైగా చిన్నారుల ఆచూకీ తెలుసుకోగలిగామని యూఐడిఏఐ(యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. అజయ్‌ ఢిల్లీలో నిర్వహించిన సీసీసీఎస్‌ (గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌స్పేస్‌ 2017) కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో అనాథాశ్రమాల్లోని చిన్నారుల ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ చేయించాల్సి వచ్చినప్పుడు వారి వివరాలతో ఇదివరకే ఆధార్‌ కార్డు ఉన్నట్లు తెలిసింది. దీని ద్వారా తప్పిపోయిన పిల్లల ఆచూకీని తెలుసుకునే అవకాశం ఉంటుందని అజయ్‌ చెప్పారు. 2013 నుంచి 2015 వరకు దేశవ్యాప్తంగా చిన్నారులు తప్పిపోతున్న కేసులు 84 శాతానికి పెరిగాయన్నారు. ఈ మేరకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ ద్వారా తప్పిపోయిన పిల్లల ఆచూకీని తెలుసుకునే అవకాశం ఉంటుందని అజయ్‌ చెప్పారు.