సామాన్యుడి హోదాలో మిస్టర్ వాల్

SMTV Desk 2017-11-24 16:21:32  rahul dravid, viral photo, new delhi, former indian cricketer

న్యూఢిల్లీ, నవంబర్ 24 : భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రావిడ్, నిజ జీవితంలో ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తాజాగా తన సింప్లిసిటీతో ద్రావిడ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ద్రావిడ్ తన ఇద్దరు పిల్లలతో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్లాడు. అక్కడ అందరితో కలసి క్యూ లైన్లో నిలబడ్డాడు. తమ పక్కనే ఉన్న ద్రావిడ్ ను చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ద్రావిడ్ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా ఓ సామాన్యుడిలా క్యూలో నిలబడ్డాడు. సెలబ్రిటీ అనే దర్పాన్ని మచ్చుకు కూడా చూపించలేదు. ఈ ఫొటోను తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.