ముఖ్యమంత్రినే రప్పించిన ఆదర్శ జంట...

SMTV Desk 2017-11-24 16:19:29  Nitish Kumar, patna, bihar

పాట్నా, నవంబర్ 24: ఈ కాలంలో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేవారు అరుదుగా ఉంటారు. మతాంతర వివాహాలను పెద్దలు ప్రోత్సహించరని మనకు తెలిసిన విషయమే. అలాంటి ఈ రోజుల్లో పాట్నాకు చెందిన సంజిత్ కుమార్, జూహి అనే యువతిని కట్నం లేకుండా ఈ నెల 19న మతాంతర వివాహం చేసుకోవడం విశేషంగా మారింది. ఈ జంటను అభినందించడానికి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వారి ఇంటికి వెళ్లారు. నూతన వధు వరులకు పుష్పగుచ్చాలను అందించి, ఆశీర్వదించారు. ఇతరులు కూడా ఈ జోడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.