ఆకాశానంటుతున్న టొమాటో ధరలు

SMTV Desk 2017-11-24 16:16:55  Tomato prices high, delhi,

న్యూఢిల్లీ, నవంబర్ 24 : రాజధానైన ఢిల్లీలో టొమాటో ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కిలో టొమాటో ధర రూ.80కి చేరింది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లోని టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయిందని అజాద్‌పూర్‌ మండి టొమాటో మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ కౌశిక్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 90శాతం మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తర్వాతి కాపు చేతికి వచ్చే సరికి సుమారు 20 రోజులకు పైగా పడుతుందని రైతులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన అజాద్‌పూర్‌ మండిలో కిలో టొమాటో రూ.40-50 పలుకుతోంది. ఈ మేరకు రిటైల్‌ మార్కెట్‌లో టొమాటో ధరలు భగ్గుమంటున్నాయి.