యదాద్రిలో సీఎం కేసీఆర్

SMTV Desk 2017-11-24 14:51:40  Telangana cm kcr, yadadri, temple

యాదగిరి గుట్ట, నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా యాదాద్రి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుంగ బాలు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకుని యాదగిరీశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపం మొదటి అంతస్థులో కాకతీయ స్తంభాన్ని అమర్చే పనులకు శంకుస్థాపన చేశారు. గుట్ట ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన ఆలయంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న కేసీఆర్‌ ఇక్కడ ఏడాదిన్నర కాలంగా సాగుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. ప్రధాన ఆలయ ముఖ మండప నిర్మాణంలో అత్యంత విశేషమైన భారీ కాకతీయ పిల్లర్‌కు సీఎం ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించారు.