గృహ నిర్బంధం నుంచి విడుదలైన జేయూడీ చీఫ్‌

SMTV Desk 2017-11-24 14:40:07  jud chief, Hafiz Muhammad Saeed, pakistan, lahore

లాహోర్, నవంబర్ 24 : ముంబై మారణ హోమనికి ప్రధాన కారకుడు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సయీద్‌ కు పాక్ ఆధికారులు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " ఇకపై కశ్మీరీల కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇందుకోసం పాకిస్థాన్‌ ప్రజలను ఏకం చేసి కశ్మీరీలకు వారు కోరుకునే స్వాత్రంత్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. ముంబై దాడులలో ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను జనవరి 31 నుంచి పాక్ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 23తో అతడి నిర్బంధం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడి నిర్బంధ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాల్సిందిగా పాక్‌ ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన లాహోర్‌ హైకోర్టు సయీద్‌ నిర్బంధం పొడగించాల్సిన అవసరం లేదని, అతడిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.