ఈ నెల 27 నుంచి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ

SMTV Desk 2017-11-24 11:15:22  Indian Prime Minister Narendra Modi, gujarath assembly elections

అహ్మదాబాద్‌, నవంబర్ 24 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి ప్రచార బరిలో దిగనున్నారు. ఈ సందర్బంగా సౌరాష్ట్ర,దక్షిణ గుజరాత్‌లో మొత్తం 8 ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రాష్ట్ర భాజపా వ్యవహారాల బాధ్యుడు భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 స్థానాలకు తొలిదశలో భాగంగా డిసెంబర్ 9న ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.