అట్టహాసంగా నటి నమిత, వివాహం

SMTV Desk 2017-11-24 03:06:57  namitha, Virendra Choudhary, tirupathi,

తిరుపతి, నవంబర్ 24: అందాల సినీ నటి, బొద్దుగుమ్మ నమిత, వివాహం ఈరోజు తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో అట్టహాసంగా జరిగింది. తమిళ నటుడు, నిర్మాత వీరేంద్ర చౌదరిని, ఆమె పెళ్లాడారు. గురువారం చెన్నైలోని నమిత నివాసంలో మెహందీ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లుగా తాను వీరేంద్రతో ప్రేమలో ఉన్నానని నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నానని నమిత గత నెలలోనే వీడియో మెసేజ్‌ ద్వారా ప్రకటించారు. ఈ నూతన వధు వరులను ఆశీర్వదించడానికి రాధిక, శరత్‌ కుమార్‌ దంపతులు, పలువురు తమిళ నటులు హాజరయ్యారు.