చెక్‌బుక్‌ రద్దుపై విస్తృత ప్రచారం పై ప్రభుత్వం క్లారిటీ!

SMTV Desk 2017-11-23 20:00:01  Digital transactions, check books, central government, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఇటీవల డిజిటల్‌ లావాదేవీలు పెచ్చే విషయంలో చెక్‌బుక్‌ల రద్దు చేసేందుకు కేంద్రం యోచిస్తోందని వ్యాపారుల సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. ఈ నేపథ్యంలో చెక్‌బుక్కుల రద్దు గురించి ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ..ప్రభుత్వం ఇప్పటివరకు చెక్‌బుక్‌ల రద్దుపై ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపింది. డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా భవిష్యత్‌లో చెక్‌బుక్‌లను ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ ఒక వర్గం మీడియా విస్తృత ప్రచారం చేయడంతో, అలాంటి ప్రతిపాదనేదీ మా వద్ద లేదని ఆ శాఖ ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.